ప్రపంచంతో పోరాడుతాడు.. ప్రేమకు లొంగిపోతాడు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నటిస్తున్న క్రేజీ చిత్రం ‘రౌడీ జనార్థన’. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాను రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శనివారం హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్‌తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన ఛాతీపై కథానాయకి కీర్తి సురేశ్ కాలు పెట్టినట్లు చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. యాక్షన్‌తోపాటు రొమాంటిక్ యాంగిల్‌ను సూచిస్తోందీ పోస్టర్. ఈ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి డీవోపీగా ఆనంద్ పీ చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా డినో శంకర్ వ్యవహరిస్తున్నారు.
‘రణబాలి’ కోసం గుర్రపు స్వారీ శిక్షణ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి‘. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.
రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారో ఈ వీడియోలో చూపించారు. స్టాలియన్ అనే బ్రీడ్‌కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం చాలా కష్టం. అయితే సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్.. చాలా ప్రయత్నాలు చేసి, గాయాలకు తట్టుకుని సక్సెస్ ఫుల్‌గా హార్స్ రైడింగ్ చేయడం ఈ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటోంది.
ప్రపంచం వ్యతిరేకించినా..
విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా లైనప్‌లో వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..’ అంటూ ఈ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చేతిలో ఖడ్గం తో సింహాసనంపై కూర్చుని ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటోంది.
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’, ‘ఫాల్ ఔట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ ఈ సినిమాకు డీవో పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’, ‘బ్యాట్ మ్యాన్ ఫరెవర్’, ‘స్నోపియర్సర్’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ ఎరిక్ డస్ట్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా.. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రా ప్‌లో రూపొందనున్న ఈ సినిమా హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సమకూర్చుతున్నారు.






