10 May, 2026 | 12:59 AM

అవార్డుల కలెక్టర్

10-05-2026 12:04 AM

ప్రభుత్వ ఉద్యోగులు వారు చేసే నిర్వర్తించే విధుల్లో నిబద్ధత, నిజాయతీ ఉంటే ఒకటికి రెండు అవార్డులు దక్కడం విశేషం. కానీ అదిలాబాద్ జిల్లాను అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ రాజర్శి షాకు ఒకటి మించి అవార్డులు అవార్డులు దక్కడం విశేషం. ఆయన చేసిన పనుల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు సాధించారు. 

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజర్షిషా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు. అధికారులతో  సమన్వయం పాటిస్తూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం  వెనుకబడిన ప్రాంతంగా నార్నూర్ మండలాన్ని ఒక బ్లాక్‌గా గుర్తించింది. నార్నూర్ మండల్ అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కలెక్టర్ తన బాధ్యతగా భావించి  నార్నూర్ బ్లాక్‌ను దేశంలోనే మొదటి స్థానంగా నిలిపారు. నార్నూర్ మండలంలో తాగునీటి  సౌకర్యంతోపాటు విద్య, వైద్య రంగాల్లో నార్నూర్ బ్లాక్ విద్యార్థులు ముందుకు సాగే విధంగా డిజిటల్ గ్రంథాలయం, ఇతర సౌకర్యాలను కల్పించారు.

గుట్టలు, రాళ్లలో ఉండే నార్మల్ బ్లాక్‌ను నీటి నిలువలు పెరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. చెక్ డ్యాములు పరుగులు తీసే నీటికి నడక నేర్పిస్తూ, నడిచే నీటికి  నిలకడ నేర్పించడంతో సాగు నీటి నిలువలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, గవర్నర్‌తో పాటు నీతి ఆయోగ్ జాతీయ స్థాయి అధికారుల నుంచి అవార్డులు పొందారు. 

ప్రజల మనిషిగా గుర్తింపు

జిల్లా కలెక్టర్‌గా రాజర్షిషా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. జిల్లాలోని 20 మండలాల్లో గూడెంను సందర్శించిన ఘనత ఈయనకే దక్కింది. జిల్లాలో కలెక్టర్ పేరు తెలియని వారు ఎవరూ లేరు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా విధులు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో అవార్డు పొందడంపై అన్ని వర్గాల ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 బండారి లక్ష్మీనర్సయ్య 

(ఉట్నూర్, విజయక్రాంతి)