9 May, 2026 | 9:54 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం

09-05-2026 09:14 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్‌ను మరోసారి నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెండోసారి బాధ్యతలు అప్పగించడంతో శ్రీరామ్ వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తన నియామకంలో కీలక పాత్ర పోషించి మద్దతుగా నిలిచిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని యువతను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఆయన నియామకంపై మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.