ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు
09-05-2026 08:54 PM
కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ – లలిత దంపతుల 29వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులు కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాందాస్ నాయక్ – లలిత దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.






