9 May, 2026 | 10:12 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

09-05-2026 09:08 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా, తాడూరు మండలం, తుమ్మలసూర్ గ్రామానికి చెందిన బండారి సాయిబాబు (31) రామ్ నాయుడు అనే వ్యక్తి దగ్గర లారీ డ్రైవర్ గా పని చేస్తూ (TS 22 T5657) ఇటుక లారీ నడిపిస్తున్నాడు.

అతను పెద్దపల్లి నుంచి తన లారీలో ఇటుకలను లోడ్ చేసుకొని ఓఆర్ఆర్ పై మేడ్చల్ వైపు నుండి పెద్ద అంబర్ పేట్ వెళ్తుండగా మార్గమధ్యలో శనివారం ఉదయం 4.30 గంటలకు ఘట్కేసర్ ఎగ్జిట్ దాటిన తర్వాత పవర్ గ్రిడ్ సమీపంలో తన లారీని కంట్రోల్ చేసుకోకుండా ముందు వెళ్తున్నటువంటి మరొక లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో అతని తలకు, ముఖానికి, మెడకు ఇతర శరీర భాగాలకు రక్త గాయాలైనాయి.

వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఘట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఐదున్నర గంటలకు డ్రైవర్ సాయిబాబు చనిపోయినట్లుగా డ్యూటీ డాక్టర్స్ నిర్ధారించిన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీ నందు శివపరీక్ష నిమిత్తం తరలించి తన తండ్రి అయిన రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.