టీజీ20 ఓ మోసపూరిత లీగ్: టీసీఏ
విజయదేవరకొండకు నోటీసులు
బీసీసీఐ అనుమతి ఎక్కడ ?: గురువారెడ్డి
హైదరాబాద్, జూన్ 17: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్‌కు బీసీసీఐ అను మతి ఉంటే ఎందుకు బయ టపెట్టడం లేదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రశ్నించింది. టీజీ20 లీగ్‌ను మోసపూ రిత లీగ్‌గా అభివర్ణించిన టీసీఏ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహ రిస్తున్న హీరో విజయ దేవరకొండకు లీగల్ నోటీసులు పంపించింది. అలాగే వెంకటేశ్ నాయుడు, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు పంపించినట్టు టీసీఏ సెక్రటరీ ధరం గురువా రెడ్డి చెప్పారు.
బీసీసీఐ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన అనుమతులు లేకుండానే ఈ లీగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహించబడు తున్న ఈ లీగ్‌లో భాగమైన ప్రతి వ్యక్తి, సంస్థ, ప్రమోటర్, ఫ్రాంచైజీ యాజమాన్యం భవిష్యత్తులో చట్టపరమైన, క్రిమినల్ పరిణా మాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ రించారు. ఈ సందర్భంగా టీజీ20 లీగ్ చట్టబ ద్ధత, హెచ్‌సీఏ వాణిజ్య కార్యకలాపా లు, రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమే యం, సినీ ప్రముఖులు క్రికెటర్ల భాగస్వా మ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
బీసీసీఐ అనుమతులు లేని లీగ్‌ను ప్రమోట్ చేయడా నికి విజయ దేవరకొండ, వెంకటేశ్ వంటి హీరోలు అనుమతి పత్రాలు పరి శీలించారా అని ప్రశ్నించారు. అనుమతులు లేని లీగ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ యువ క్రికెటర్ల భవిష్యత్తు ప్రమా దంలో పడే అవకాశం ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీసీఐ నిబంధనల ప్రకా రం ఏ రాష్ట్ర క్రికెట్ సంఘ మైనా కమర్షియల్ టీ20 లీగ్ నిర్వ హించాలంటే ముందస్తుగా బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుం దని గురువారెడ్డి పేర్కొన్నారు. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ లీగ్‌లో ఎలా పాల్గొంటున్నారో స్పష్టం చేయా లని కోరిన ఆయన, బీసీసీఐ అనుమతులు ఉంటే వెంటనే వాటిని ప్రజల ముందుం చాలని హెచ్‌సీఏకు సవాల్ విసిరారు. హైదరాబాద్ క్రికెట్ అసో సియేషన్ పరిధి హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమిత మని, మొత్తం తెలంగాణ క్రికెట్‌కు ప్రతినిధిగా వ్యవహరించే అధికారం హెచ్‌లీఏకు లేదన్నారు.






