5 August, 2026 | 6:16 AM

ఓటరు జాబితా సవరణలో నర్సాపూర్ ఆదర్శంగా నిలవాలి

04-08-2026 01:07 PM

నర్సాపూర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి నర్సాపూర్‌ను రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏలు, బీఎల్‌ఓ సూపర్వైజర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గత నెల రోజులుగా బీఎల్‌ఏలు, సూపర్వైజర్లు అంకితభావంతో పనిచేయడంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 99 శాతం పూర్తైందని తెలిపారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ కోసం సంబంధిత బీఎల్‌ఓలకు సకాలంలో అందజేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ ప్రక్రియలో చివరి అర్హత కలిగిన ఓటరు వరకు సర్వే పూర్తి చేయాలని కోరారు.