భారీగా గంజాయిని పట్టుకున్న నార్కోటిక్ పోలీసులు
25-08-2026 12:00 AM
వరంగల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): వరంగల్ నార్కోటిక్ పోలీసులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి 129 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడినుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారు, ఇందులో ఎంత మంది ఉన్నారు అనే అంశంపై విచారణ చేపట్టారు.






