2 June, 2026 | 4:38 AM

సత్తా చాటిన నారాయణ విద్యార్థులు

02-06-2026 01:57 AM
  1. జేఈఈ ఫలితాల్లో ప్రభంజనం
  2. ఆలిండియా టాప్ 20లో 6 ర్యాంకులు
  3. టాప్ 5 వ ర్యాంక్ సాధించిన కుచి సందీప్

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): జేఈఈ -అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా మరోసారి తమ సత్తా చాటా రు. ఆలిండియా ఓపెన్ కేటగిరీ టాప్ 20లో ఏకంగా 6 ర్యాంకులను కైవసం చేసుకుని నారాయణ విద్యాసంస్థలు ఏకచత్రాధిపత్యం వహించాయి.

ఓపెన్ కేటగిరీలో కుచి సందీప్ 5 వ ర్యాంక్ సాధించగా, మను పరమేశ్వరన్ 13 వ ర్యాంక్, ప్రిన్స్ చౌదరి 14 వ ర్యాంక్, వెల్లుర్తి హర్షిత్ 15 వ ర్యాంక్, తనయ్ అగర్వాల్ 16 వ ర్యాంక్, అనీష్ ముప్పాల 20వ ర్యాంక్‌తో టాప్ 20లో నిలిచారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 22, 23, 24, 27, 35, 39, 41, 44, 51, 54, 57, 58, 60, 61, 63, 71, 72, 75, 78, 79, 80, 83, 84, 89, 98, 99, 100 వంటి టాప్ ర్యాంకులతో పాటు.. ఓపెన్ కేటగిరీ టాప్ 50 లోపు 14 ర్యాంకులు, టాప్ 100 లోపు 35 ర్యాంకు లు, 500 లోపు 133 ర్యాంకులు, 1000 లోపు 217 ర్యాంకులను నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని సంస్థ డైరెక్టర్లు డాఈ పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు.

అన్ని కేటగిరీల్లో 10 లోపు 16 ర్యాంకులు, 50 లోపు 69 ర్యాంకు లు, 100 లోపు 147, 500 లోపు 540, 1000 లోపు 894 ర్యాంకులు సాధించి ఐఐ టీ ఆశయాలను సాకారం చేయడంలో నారాయణకు సాటిలేరని పేర్కొన్నారు.  ఈ సంద ర్భంగా పి సింధూర నారాయణ మాట్లాడు తూ.. ఈ అద్భుత విజయానికి కుచి సందీప్ నాయకత్వం వహించాడని హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ ఎన్-లెర్న్ యాప్ ద్వారా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు, ఆన్లైన్ మాక్ టెస్ట్లు నిర్వహించడం వల్లే విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబ రిచారన్నారు.