బోధన్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
బోధన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర నగర్ సంతాన నాగమ్మ మందిరం వద్ద నాగదేవతకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, అనంతరం భక్తుల కోసం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, ఆగస్టు 17 (విజయక్రాంతి): మండలంలో సోమవారం నాగుల పంచమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని గ్రామాలలో ఉదయం నుం చే నాగుల పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లి భ క్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తలంటు స్నానాలు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆవు పాలు తీసుకువెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పుట్టలలో పాలు పోసి పూ జలు చేశారు.
తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో, కృష్ణాజివాడిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, ఎర్ర పహాడ్‌లోని ఎల్లమ్మ ఆలయం, నందివాడలోని హనుమాన్ ఆలయం, చిట్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, సంతాయిపేట లోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో,దేమికలాన్ లోని శ్రీ పార్వతి దేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాజివాడి లో ప్రత్యేకంగా భక్తులకు ఆల యం కమిటీ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.






