18 August, 2026 | 3:08 AM

దోమకొండలో 9 ఫిర్యాదుల స్వీకరణ

18-08-2026 02:03 AM

దోమకొండ, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మం డల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సో మవారం నుంచి ప్రారంభించింది. ఇందులో భాగంగా దోమకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మం డల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు జరిగిన కార్యక్రమం నోడల్ అధికారి, ఎంపీడీవో మధురిమ పర్యవేక్షణలో కొనసాగింది.

తొలిరోజు దోమకొండ మండల పరిధిలో మొత్తం 9 మంది ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 3, విద్యుత్ శాఖకు 3, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి 3 ఫిర్యాదులు ఉన్నాయి. స్వీకరిం చిన ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో ఆ న్లైన్లో నమోదు చేసి,

తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు పంపినట్లు అధికారు లు తెలిపారు. ప్రజలు ప్రతి సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని స ద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.హాజరైన అధికారులు: తహసీల్దార్ స్వప్న, ఎంపీఓ రవికుమార్, ఎంఈఓ, వైద్యాధికారి, అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారి, సీడీపీవో, ఏపీవో తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.