2 July, 2026 | 3:30 AM

నాచగిరీశుడి ఆలయ హుండీ ఆదాయం రూ.23.09 లక్షలు

02-07-2026 12:00 AM

గజ్వేల్, జూలై 1: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ప్రసిద్ధ నాచారం గుట్ట  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 98 రోజులకు సంబంధించిన హుండీ లెక్కించగా మొత్తం రూ.23,09,829 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రంగాచారి వెల్లడించారు. గుండె లెక్కింపు రంగాచారి పర్య వేక్షణలో కొనసాగగా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ధర్మకర్తలు నాగరాజు, శ్రీనివాస్, కిష్ట య్య, కొత్తపల్లి శ్రీనివాస్, నాచారం సర్పంచ్ సారిక యాదగిరి, ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్,  పాల్గొన్నారు.