2 July, 2026 | 2:14 AM

వీహెచ్‌కు బీసీ సంఘాల నేతలు పరామర్శ

02-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావును కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పార్టీ నేతలు బుధవారం ఆసుపత్రిలో పరామర్శించారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌తో గత ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు వీహెచ్‌కు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే.

ఆసుపత్రిలోనే ఉన్న వీహెచ్‌ను బీసీ కమిషన్ సభ్యులు సరేందర్, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, వాల్మికి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ గణేష్ , శ్రీధర్, రామలింగంయాదవ్, అరవింద్‌కుమార్‌గౌడ్, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ తదితరులున్నారు.