ఏఓబీ నుంచి పుణెకు గంజాయి
02-07-2026 12:00 AM
- కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- 50 లక్షల విలువ చేసే సరుకు స్వాధీనం
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఏపీూ బార్డర్ నుంచి తెలంగాణ మీదుగా పుణెకు తరలిస్తున్న రూ.50 లక్షల విలువ చేసే 102 కిలోల గంజాయిని తెలంగాణ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో పెద్ద అంబర్‌పేట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. గంజాయిని తరలిస్తున్న కారు పట్టుబడింది. నిందితుడితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కళ్లు కప్పడానికి ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తే ఆ ప్రాంతానికి చెందిన నంబర్ ప్లేట్‌ను మార్చుకుంటూ.. ఏవోబీ నుంచి రాజేష్ (27) అనే వ్యక్తి తెలంగాణ దాటి ఓఆర్‌ఆర్ ఎక్కి పుణె వెళ్లడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుకున్నారు. నిందితుడికి ఏవోబీ ప్రాంతంలో గంజాయి ఇచ్చిన వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తున్నారు.






