18 May, 2026 | 3:14 AM

ఆరోగ్యం సహకరించడం లేదు.. ఆదుకోండి..

18-05-2026 02:17 AM

విలేకరుల సమావేశంలో రిటైర్డ్ హెఎం  చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన 

ఖమ్మం, మే 17(విజయక్రాంతి):  ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ సంవత్సరం క్రితం పదవి విరమణ పొందిన తనకు ప్రాణాపాయం ఉందని, ఆరోగ్యం సహాకరించడం లేదని, నన్ను ఆదుకోవాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు చెరుకుపల్లి వెంక య్య కోరారు. క్యాన్సర్ తో పాటు ఇతర అనేక వ్యాధులు వ్యాపించాయని, చేతిలో చిల్లి గవ్వ లేక, ప్రభుత్వం నుంచి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు రాక  చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జడ్పీ జిహెఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ సంవత్సర కాలం క్రితం రిటైర్మెంట్ అయ్యానని, రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రకాల బెనిఫిట్స్ డబ్బులు దాదాపు 60 లక్షలు రావాల్సి ఉందని, నేటికీ కూడా డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 

గుండెకు రక్తప్రసరణ సక్రమంగా లేక రెండు స్టంట్ లు వేశారని, ఇవి కాక ఫ్యాంక్రియా, క్యాన్సర్ తోపాటు అనేక వ్యాధులు వ్యాపించినట్లు డాక్టర్లు నిర్ధారించడం జరిగిందని తెలిపారు. తన వద్ద ఉన్న డబ్బుతో చికిత్స కు ఖర్చు చేయడం జరిగిందని, ప్రస్తుతం క్యాన్సర్ కు, ఇతర వ్యాధులకు చికిత్స చేయాలంటే వైద్యులు దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించారు.  హైదరాబాద్ లోని అనేక ఆసుపత్రులలోను ఖమ్మంలోని పలు ఆసుపత్రులలో చికిత్స కోసం వైద్యులను సంప్రదించటం జరిగిందన్నారు.

ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నానని  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, డీఈవో ఇతర ఉన్నతాధికారులు స్పందించి తనకు రావాల్సిన బెనిఫిట్స్ డబ్బులను సకాలంలో ఇప్పించి చికిత్సకు కావాల్సిన డబ్బులను అందించి తనకు ప్రాణ బిక్ష పెట్టాలని వేడుకున్నారు. ఈ విలేకర్ల సమావేశంలో  ఎం ఆర్ ఇ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి గురు ప్రసాద్, జిల్లా అధ్యక్షులు మాడుపల్లి బాబు, అల్లంకి జయపాల్, ఎం ఈ ఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు తెల్లపూట జమాలయ, ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు బాబు, ప్రధాన కార్యదర్శి కోటపింజర రాము, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుకుపల్లి మురళి, కోశాధికారి దూరి జయరాజు, ప్రచార కార్యదర్శి తెల్లూరి యాదగిరి, టి జి పి ఓ ఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మన్నె గురుమూర్తి, ఎం ఈ ఎఫ్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కోట ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.