చెట్టు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణ
30-07-2026 12:17 PM
హాజీపూర్, (విజయక్రాంతి) : వర్షానికి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీ చెట్టు విరిగిపడింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే హాజీపూర్ ఎస్ఐ కిరణ్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని మున్సిపల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను కత్తిరించి పక్కకు తొలగించారు. దీనితో వాహనాలు యథావిధిగా నడిచాయి.






