‘పెద్ది’ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన మాజీ మంత్రులు
30-07-2026 12:09 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): గుండెపోటుకు గురై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుండ్ల కండ్ల జగదీశ్ రెడ్డి , ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు తదితరులు సమీక్షించారు. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న ను పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు ధైర్యం చెబుతూ, పార్టీ శ్రేణులు, అభిమానులందరూ సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవసరం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ, సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.






