ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
మెరిట్ విద్యార్థులకు సన్మానం ః కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ మే 17 ( విజయక్రాంతి) ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ని ర్వహించిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లాలో విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారని అన్నారు.ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యా బోధన అందిస్తున్నారని చెప్పారు.
తాను కూడా ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి అనేక మంది ప్రపంచస్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, యానిమేషన్, డాన్స్, పెయింటింగ్ వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.
ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని, ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఏసీజీఈ పరమేశ్వర్, అధికారులు, ఎంఈఓలు, విద్యార్థులు, పోషకులు తదితరులు పాల్గొన్నారు.






