నిన్నటి ఘటన మరువకముందే చిన్నారి, మహిళపై వీధి కుక్కల దాడి
వీధి కుక్కల దాడులతో బెంబేలేలుతున్న పట్టణ ప్రజలు
బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
బాన్సువాడ, జూలై 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మున్సిపల్ పరిధిలో బుధవారం సాయంత్రం వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మరువకముందే గురువారం ఉదయం బాన్సువాడ పట్టణంలోని రెండవ వార్డుకు చెందిన సానియా అనే చిన్నారితో పాటు ఓ మహిళకు వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీధి కుక్కల వరుస దాడులతో బాన్సువాడ పట్టణం మున్సిపల్ పరిధిలోని ప్రజలు చిన్నారులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్దామా అంటే కుక్కల భయంతో జింకుతున్నారు ప్రజలు. వీధి కుక్కలు ఇంత దాడులు చేసిన మున్సిపల్ కమిషనర్ తో పాటు పాలకవర్గం సభ్యులు వీధి కుక్కలను నివారించాల్సింది పోయి పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ పాలకవర్గం సభ్యులు వెంటనే వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని బాన్సువాడ పట్టణ ప్రజలు చిన్నారులు వీధి కుక్కల బారిన పడకుండా పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






