గోదావరి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
30-07-2026 12:18 PM
ఎల్లంపల్లి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర చారీ
హాజీపూర్, (విజయక్రాంతి) : కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల కావడం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన ఉన్న పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ రవీంద్ర చారీ గురు వారం తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పల్లెకారులు, గొర్రెల కాపరులు నది ఒడ్డుకు గానీ, ప్రవాహ ప్రాంతంలోకి గానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






