ప్రతీ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే నా లక్ష్యం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
గాంధారి, మే 27 (విజయ క్రాంతి): ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సీతాయి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే తన లక్ష్యం అని అన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు పిట్ల కాశీరాం - అనుషవ్వ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో గడపగడపకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని , ఇళ్లు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఓ లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు.. సీతాయిపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి , రూ.12 లక్షల తో అంగన్వాడి భవన నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మహిళా సంఘం భవనాల నిర్మాణం కొరకు సుమారు రూ.18 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు..
ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సీతాయిపల్లి గ్రామ సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్, మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బిస గణేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు,బొమ్మని బాలయ్య, తహసీల్దార్ రేణుకా చౌహాన్, సర్దార్, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు , మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






