23 July, 2026 | 2:42 AM

ఎల్‌ఈడీ లైట్లపై ఎంవీఐ కొరడా

23-07-2026 12:00 AM

బూర్గంపాడులో ఆకస్మిక వాహన తనిఖీలు

బూర్గంపాడు, జూలై 22 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు బూర్గంపాడు మండలంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వెంకట పుల్లయ్య బుధవారం ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారులపై వాహనాల ఆర్సీ, డ్రైవింగ్ లై సెన్స్, బీమా, పీయూసీ, ఫిట్నెస్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అ ధిక పవర్ ఎల్‌ఈడీ, ఫాగ్ లైట్లు అమర్చిన వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ అ ధిక వెలుతురు ఇచ్చే ఎల్‌ఈడీ లైట్ల వల్ల ఎ దురుగా వచ్చే వాహనదారులకు చూపు మందగించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఈడీ, ఫాగ్ లైట్లు అమర్చిన వా హనాలపై కేసులు నమోదు చేసి జరిమానా లు విధిస్తామని హెచ్చరించారు.

వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, పీయూసీ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని సూచించారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు జరిమానాలు విధించినట్లు తెలిపారు.