15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

20 శాతం అదనపు నమోదు సాధించాలి

10-06-2026 12:53 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ద్వారా 20 శాతం అదనపు ప్రవేశాలను సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో మంగళవారం వెబెక్స్ ద్వారా  సమీక్షా సమావేశా న్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, పాఠశాలల్లో మౌ లిక వసతుల కల్పనపై అధికారులకు పలు కీలక అంశాలపై చర్చించారు. గతంలో జీరో ఎన్రోల్మెంట్ విద్యార్థులు లేని కారణంగా మూతపడిన పాఠశాలలను గుర్తించి, ఈ విద్యా సంవత్సరం నుండి వాటిని పునఃప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.

జిల్లాకు కొత్తగా మంజూరైన 91 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లను, ఆయాలను త్వరితగతిన నియమించాలన్నారు. విస్తృత ప్రచారం నిర్వహిం చి ఈ కేంద్రాలలో చిన్నారులను పెద్ద సంఖ్య లో చేర్పించడంతో పాటు, అవసరమైన మౌ లిక వసతులను సమకూర్చాలని స్పష్టం చేశా రు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉం డాలన్నారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ర్యాంపులు, వెస్ట్రన్ టాయిలెట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయా లని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

పాఠశాలలకు ఇప్పటికే మంజూరైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లు, కంప్యూటర్లు నిరంతరం పనిచేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలని, ఇంటర్నెట్ సౌకర్యం లేని పాఠశాలల వివరాలతో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచి, డిజిటల్ బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే  ప్రాధాన్యత అని అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి బడిబాటను విజయవం తం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు హరికృష్ణ, సూర్యనారాయణ, రేణుక దేవి, పూలన్, వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.