5 March, 2026 | 3:46 AM

విరిగిన డ్రైనేజీ స్లాబ్

05-03-2026 02:06 AM

స్పందించని మున్సిపాలిటీ అధికారులు

అదుపు తప్పితే అంతే.. జరగరాని ఘటన జరిగితేనే స్పందిస్తారా?

జడ్చర్ల, మార్చి 4 : పట్టణం సాయినగర్ కాలనీ ఫేస్-3 ప్రధాన రహదారిపై ఏర్పడిన డ్రైనేజీ గుంత ప్రస్తుతం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. రద్దీగా ఉండే ఈ రహదారిపై రోజూ వందల సంఖ్యలో వాహనా లు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటా రు. అలాంటి ముఖ్యమైన మార్గంపై ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ గుంతను ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సంబంధిత డ్రైనేజీ గుంతకు పై భాగంలో ఉన్న కాం క్రీట్ స్లాబ్ పూర్తిగా విరిగిపోయింది. లోపల ఇనుప కడ్డీలు, చెత్త, విరిగిన ముక్కలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. పై నుంచి చూస్తే చిన్న సమస్యగా అనిపించినా, లోపల పెద్ద ప్రమా దం దాగి ఉంది. ఏ క్షణమైనా వాహనం అదుపు తప్పితే లేదా పాదచారి జారిపడితే తీవ్ర గాయాలు కావడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ రహ దారి గుండా ప్రతిరోజూ స్కూల్ బస్సులు, కాలేజీ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు ప్రయాణిస్తుంటాయి. ము ఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. అటువంటి సమయంలో ఈ గుంత ప్రమా దాలకు ఆహ్వానం పలుకుతోంది.

స్థానికుల కథనం ప్రకారం, ఈ గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. అధికారుల వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఇసుక, కంకర పోసి సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం తప్ప, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదని విమర్శిస్తున్నారు.

వర్షాకాలంలో ఈ గుం తలో నీరు నిల్వ ఉండటంతో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీటిలో గుంత కనిపించకపోవడంతో వాహనదారులు జారిపడడం, టైర్లు దెబ్బతినడం, వాహనాలు నిలిచిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహన దారులు ఈ గుంత కారణంగా ప్రమాదాలకు గురయ్యారని సమాచారం. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకపోయినా, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశముందని ప్రజలు భయపడుతున్నారు.

ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలు స్పందించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రజల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంతను వెంటనే పక్కా కాంక్రీట్ స్లాబ్తో మూసివేసి, రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నాణ్యమైన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.ప్రజల ప్రాణాల విలువను గుర్తించిన అధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణ చర్యలు తీసుకో వాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.