22 April, 2026 | 2:16 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

గడి మైసమ్మకు మున్సిపల్ కార్మికుల బోనాలు

09-04-2026 03:29 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని గడి మైసమ్మ కు మున్సిపల్ కార్మికులు గురువారం బోనాలతో ఊరేగింపు చేపట్టారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బోనాలతో మున్సిపల్ కార్యాలయం నుండి గడి మైసమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

అనంతరం  చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కార్యాలయం నుండి అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి దయతో గ్రామం అంత చల్లగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మాసుల ప్రవీణ్, బత్తుల నరేష్,కాజా అజీముద్దీన్, నాయకులు ముకీం,మేనేజర్ వెంకటలక్ష్మి,అజ్మతుల్ల బేగ్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, వెంకటేష్ అధికారులు పరిశుద్ధ కార్మికులు కార్యాలయ పాల్గొన్నారు.