calender_icon.png 12 February, 2026 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు

12-02-2026 12:28:53 AM

  1. చెదురు మధురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం 

77.44 శాతం పోలింగ్      

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు 

మిర్యాలగూడ, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):మిర్యాలగూడ  మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 48 వార్డులలో  144 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 199మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలు పటిష్టంగా జరిగేందుకు 300 మంది పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

830 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనగా,  ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 93,202 మంది ఓటర్లుండగా 77.44 శాతం ఓటింగ్ నమోదు అయింది. నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు.వికలాంగులు వయో వృద్ధుల కొరకు ప్రత్యేకంగా వీల్ చైర్ లను ఏర్పాటు చేశారు. 

మిర్యాలగూడ డీ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంచగా చెదురు మదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ 41 వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని 45 వార్డులో మిర్యాలగూడ మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.