22 April, 2026 | 2:57 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

స్వల్ప సంఘటనతో ఎన్నికలు ప్రశాంతం

12-02-2026 12:30 AM
  1. దొంగ ఓట్లు వేస్తున్నారని అభ్యర్థుల ఆందోళన
  2. పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శలు
  3. ఓటర్ల ప్రసన్నం కోసం అభ్యర్థుల పొర్లు దండాలు

నల్గొండ టౌన్, ఫిబ్రవరి 11: వాళ్ళ సంఘటన మినహా మున్సిపల్ ఎన్నికలు నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయినల్గొండ జిల్లా కేంద్రం లో పలు వార్డులో దొo గ ఓట్లు వేస్తున్నారని అభ్యర్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు 25, 10,32,30, వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని అభ్యర్థులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొంగ ఓట్లు వేసుకునేందుకు సార్ పోలీసులు సహకరిస్తు న్నారని ప్రత్యక్ష పార్టీ అభ్యర్థులు ఆరోపించారు.

10,25వార్డులో దొంగ ఓట్లు వేసిన అభ్యర్థులను పట్టుకుని పోలీసులకు అప్పగించే క్రమంలో వివాదం చోటు చేసుకుంది ఒకరి బదులు ఒకరు నకిలీ ఐడీ కార్డుతో ఓటు వేస్తున్నారని బిజెపి బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆరోపించారు 10 వార్డు వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పై నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని అందుకు నిరసనగా బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగగా పోలీసులు స్వల్ప లాటి చార్జితోచదరగొట్టారు.

25 వ వార్డు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుతో టిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు 32 వ వార్డు వద్ద ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఇవ్వడం జరగడంతో టిఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసు వాహనాన్ని ఎక్కించడంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగట్టి నిరసన చేపడతామని హెచ్చరించడంతో పోలీసులు వాహనంలోకి ఎక్కించిన టిఆర్‌ఎస్ కార్యకర్తను దించడంతో వివాదం సద్దుమణిగింది

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. 

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పైత్తులు వేశారు ఓటుకు 2000 నుండి 10000 వరకు పంపిణీ చేశారు మద్యం సీసాలతో పాటు చీరలు అందజేశారు 14వ వార్డులో మటన్ పంపిణీ చేస్తున్నారని పోలీసులకు తెలియడంతో పోలీసులు మటన్ స్వాధీనం చేసుకొని తిరిగి వచ్చారు కార్యకర్తలకు టిఫిన్ అందజేసేందుకు ఏర్పాటు చేయగా టెంటు ఇతర సామాగ్రి నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చారు.

కొన్నిచోట్ల పోలీసుల ఉత్సాహం చేశారని బి ఆర్‌ఎస్ కార్యకర్తల నుండి విమర్శలు వెలివేత్తాయి కాంగ్రెస్ వారు పంపిణీ చేసే వాటిని పట్టుకోకుండా కేవలం టిఆర్‌ఎస్ అభ్యర్థుల పంపిణీ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని పోలీసులు కాంగ్రెస్ పక్షాన పని చేశారని విమర్శలు చేశారు పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎవరికి వారే తనదే విజయం అంటూ దీ మా గా ఉన్నారు