7వ వార్డులో విషాదం
బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజావాడ లావణ్య నాగరాజు
రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన కమఠం దేవమ్మ మరణించిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గజావాడ లావణ్య నాగరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సహాయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో రూ.5,000 నగదు, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఈ కష్టకాలంలో కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గజావాడ నాగరాజు, బైరాం కుమార్, చింతల యాదగిరి, మధునాల స్వామి గౌడ్, తొంటవాలి యాదగిరి, గావు భాస్కర్, బొట్ల బాబు, బొర్రా అనిల్, అసాది రాజు, బైరాం శంకర్, బైరాం శ్రీనివాస్, ఒద్ది స్వామి, బైరాం పెద్ద స్వామి, బొర్రా రమేష్, గావు సతీష్, ఉట్ల బాబు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






