9 June, 2026 | 1:49 AM

గాడిలో పడని బల్దియా పాలన!

09-06-2026 12:23 AM
  1. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు గడిచిన కుదరని సఖ్యత 
  2. అభివృద్ధి పనులపై ఎవరి దారి వారిదే..
  3. మూడు ప్రధాన పార్టీల కౌన్సిలర్ లు ఉన్న సఖ్యత కరువు
  4. ప్రజల సమస్యలపై పట్టింపు కరువు 
  5. మొక్కుబడిగా స్వీకరిస్తున్న దరఖాస్తులు

కామారెడ్డి, జూన్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి బల్దియ పాలన గాడిలో పడడం లేదు. పాలకవర్గం పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు గడిచిన కౌన్సిలర్ల మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో అభివృద్ధిపై ఎవరి దారి వారిదే అన్నట్లుగా కామారెడ్డి బల్దియా తీరు మారింది.

పాలన పగ్గాలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లతోపాటు కౌన్సిలర్ లు స్థానిక సమస్యలపై ప్రజలు విన్నవిస్తున్న అభివృద్ధి పనులు చేపట్టేందుకు కొందరు కౌన్సిలర్లు ముందుకు వస్తున్న వారికి పాలకవర్గం ప్రతినిధుల్లో సఖ్యత కరువు కావడంతో అభివృద్ధి పై ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే సామెత లాగా కామారెడ్డి లో బల్దియా పాలన కొనసాగుతుంది.

ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్తగా కౌన్సిలర్లను గెలిపిస్తే అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన పారిశుద్ధ్య సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు.

మొక్కుబడి దరఖాస్తులు

 ఇటీవల వార్డు సభలు నిర్వహిస్తుండగా ప్రజలు స్థానిక సమస్య లు పరిష్కారం జరుగుతాయని ఎన్నో ఆశలు పెట్టుకొని దరఖాస్తులు చేస్తే మొక్కుబడిగా తీసుకుంటున్నారు తప్ప పనుల పరిష్కారానికి పాలకవర్గం చర్యలు చేపట్టడం లేదు. ఎవరి దారి వారిది అనే సామెత లాగా కామారెడ్డి బాల్దియాలో గెలుపొందిన ప్రధాన పార్టీల కౌన్సిలర్ లు ఎవరి దారి వారిదే అన్నా సామెత లాగా వ్యవహరిస్తున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతుంది. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు గడిచిన ఒక్క పని అంటే ఒక్క పని కూడా కాలనీలో ప్రారంభం కావడం లేదంటే నూతన పాలకవర్గ సభ్యుల మధ్య సఖ్యత ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు ఉక్కిరి బిక్కిరి

కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు ఎటు పాలు పోవడం లేదు. ఏ మేమి చెప్పి గెలిచాము. ప్రజలకు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో కొందరు మహిళా కౌన్సిలర్ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు వేయించుకొని కౌన్సిలర్ గా గెలుపొందిన తమకు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకవర్గం, అధికారులు సహకరించడం లేదని పలువురు కౌన్సిలర్లు ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఏకరువు పెట్టారు.

బల్దియా సమావేశంలో తమ గోడును వెళ్ళ బూచ్చుకున్న సమస్యల పరిష్కారం పట్ల పాలక వర్గం సభ్యుల్లో సఖ్యాత లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి బాధ్యతలు చేపట్టిన వైస్ చైర్మన్ గా బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన కాసర్ల గోదావరి, బాధ్యతలు చేపట్టారు.

బిజెపికి చెందిన 16 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో మూడు ప్రధాన పార్టీల కు చెందిన కౌన్సిలర్లు గెలుపొందిన వారిలో అభివృద్ధి పనుల విషయంలో కలిసి ముందుకు కదలడం లేదు. దీంతో అభివృద్ధి పనుల విషయంలో ముందుకు సాగడం లేవు.

పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

 కాంట్రాక్టర్ లు సైతం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతంలో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కొత్త పనులు చేస్తే మరింత అప్పుల లోకి వెళ్తామని కౌన్సిలర్ల మధ్య సఖ్యత లేకపోవడం తో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులు పనులు చేపడతామంటే అధికారులు సహకరించడం లేదు. అధికారులు సహకరిస్తే ప్రజాప్రతినిధుల్లో ఐక్యత లేకపోవడం వల్ల పనులు చేపట్టిన వాటిపట్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.

పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన...

 కామారెడ్డి బల్దియ పాలకవర్గం పాలన పగ్గాలు చేపట్టి 100 రోజులు గడిచిన ఒక వార్డులో కూడా అభివృద్ధి పనులు జరగలేదంటే చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఎవరికి వారే అన్న సామెత లాగా బల్దియా పాలన కొనసాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించేందుకు కూడా ముందుకు రావడం లేదంటే అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతాయని పలువురు కౌన్సిలర్ లు బహిరంగంగానే వాపోతున్నారు.

ఇలా సాగితే అభివృద్ధి పనులు చేపట్టక ప్రజల మధ్య చులకన గా ఉండాల్సి వస్తుందని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండడంతో అధికార పార్టీ చైర్ పర్సన్ కావడం తో అధికారులు ఎవరి మాటలు వినాలా అర్థం కాక ఇటీవల వచ్చిన మున్సిపల్ కమిషనర్ వచ్చిన వారం రోజుల్లోనే సెలవు పై వెళ్లడం తో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని తిరిగి కమిషనర్ను రప్పించారు. అధికారుల తో పనులు జరగాలంటే కౌన్సిలర్లు సఖ్యతగా ఉంది అధికారులతో పనులు చేయించి అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

అభివృద్ధి పనులపై పాలక వర్గం దృష్టి పెట్టేనా

 కామారెడ్డిలో 49 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు 49 మంది కౌన్సిలర్లు, ఇటీవల నూతనంగా నలుగురు కో ఆప్షన్ సభ్యులు నియామక మయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ కొనసాగుతున్న మూడు ప్రధాన పార్టీ లు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల కౌన్సిలర్లు ఉండడంతో అభివృద్ధి పనుల విషయంలో అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే అభివృద్ధి పనులు ముందుకు సాగనున్నాయి. ఇకనైనా వంద రోజుల పాలన గడిచిపోయిన ఇప్పటినుంచైనా కలిసి అభివృద్ధి పనుల వైపు బల్దియా పాలన సాగిస్తారని ఆశిద్దాం.

కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం 

కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డుల కౌన్సిలర్లతో పాటు కోఆప్షన్ సభ్యుల సహకారం, స్థానిక ఎమ్మెల్యే సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారం తీసుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం నివేదికలు తయారు చేయించా. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కౌన్సిలర్లు అందరి సహకారంతో పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతాను. వార్డు కౌన్సిలర్లతో కలిసి కట్టుగా ఉండి అభివృద్ధి పై దృష్టి పెడుతున్నాం.

- ఇప్ప ఉమారాణి,

మున్సిపల్ చైర్ పర్సన్, కామారెడ్డి