8 August, 2026 | 3:07 AM

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

08-08-2026 01:57 AM

 రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒ క్కరూ ఒక మొక్క నాటాలని రాష్ట్ర బీసీ సంక్షే మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారంవెన్క పల్లి - సైదాపూర్ మండల కేంద్రంలో 30 లక్షల రూ పాయల వ్యయంతో 100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి, నూతన వ్యవసాయ మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నా టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పొన్నం ప్రభాకర్ సైదాపూర్ మండలంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మా ర్కెట్ యార్డ్ అభివృద్ధికి 1.5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామని, 30 లక్షలతో 100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించుకుంటున్నామన్నారు. మార్కెట్ యార్డ్ రాబోయే కాలంలో రైతులకు మరింత సేవలందించే విధంగా ఉంటుందన్నారు. సైదాపూర్ మం డలంలోని ఏ గ్రామంలో అయినా ఐదు ఎకరాలు కేటాయిస్తే సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామ పౌరుడు వారి నివాసంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని, 5 ఎకరాల పైనున్నవారు ఆయిల్ ఫామ్స్ సాగు చేయాలన్నారు. వర్షపు నీటిని ఆదా చేసుకోవడానికి ఇంజక్షన్ బోర్స్ సిద్ధం చేసు కోవాలని, జలసిరి కార్యక్రమంలో ప్రతి ఒక్క రు భాగస్వామ్యం కావాలని, జలసిరి రైతాంగానికి అన్ని రకాలుగా ఉపయోగపడే కార్య క్రమమని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్య క్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ముఖ్య నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.