8 August, 2026 | 2:59 AM

విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

08-08-2026 01:56 AM
  1. పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికీ 50 కోట్లు 
  2. సుల్తానాబాద్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు 
  3. పూర్వ విద్యార్థి గా ఈ కళాశాల అభివృద్ధి చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది
  4. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స ర్కార్ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని,అందులో భాగంగానే పెద్దపల్లినియోజక వర్గంలో రెండున్నర సంవత్సరాలలో 50 కోట్ల రూపాయలు విద్యారంగా అభివృద్ధికి కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే వేడుకలకార్యక్రమం ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి,

ముఖ్యఅతిథిగా పాల్గొ న్న చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ...నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్ లో నెలకొల్పు తున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇందులో విద్యాభ్యాసం ఉంటుందన్నారు. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ప్రభుత్వ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

సుల్తానాబాద్ ప్రభుత్వ కాలేజీలో చదివిన వారు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. తాను కూడా ఇదే కళాశాలలో చదవడం గర్వంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కాలేజీని మంచి ఫలితాలతో క్రమశిక్షణతో నడుపుతున్న ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ఆటలు, పాటలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి,  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,జిల్లా లైబ్రరీ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , కమిషనర్ రమేష్ , ప్రిన్సిపాల్ రామచంద్ర రెడ్డి , హెచ్‌ఎం రత్నాకర్ , కౌన్సిలర్లు ఉపాధ్యాయులు, స్పోరట్స్ క్లబ్ అధ్యక్షుడు ము త్యాల రవీందర్ , నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.