8 August, 2026 | 3:08 AM

నారాయణపూర్ చెరువు అభివృద్ధికి రూ.20 కోట్లు విడుదల

08-08-2026 01:58 AM

ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి

చొప్పదండి, ఆగస్టు 7 (విజయ క్రాంతి) : చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి తె లంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని నారాయణపూర్ చెరువు అభివృద్ధి, బండ్ విస్తరణ పనులకు కీలకమైన భూసేకరణ కో సం ప్రభుత్వం 20 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న నారాయణపూర్ చెరు వు అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా బండ్ విస్తరణ, గ్రావిటీ కాలువ నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ పనులకు వేగం చేకూరనుంది.

ఈ నిధుల మంజూరుతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన నిరంతర కృషి ఫలించింది. ఈ ప్రాజెక్టు ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, బోయిన్పల్లి, కొడిమ్యాల, మల్యాల ప్రాంతాల రైతులకు ప్రధానంగా సాగునీటి లబ్ధి చేకూరనుంది. నారాయణపూర్ చెరువు కింద 49,500 ఎకరాల ప్రత్యక్ష ఆయకట్టుకు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద మరో 1.00 లక్ష ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది.

ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు. రైతులకు శాశ్వత సాగునీటి వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరు అందించేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన కృషి కొనసాగుతుందని తెలిపారు. నారాయణపూర్ చెరువు అభివృద్ధిలో భాగంగా భూసేకరణ కోసం 20 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయమన్నారు.

ఈ నిధుల విడుదలకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు రైతాంగ అభ్యున్నతికి, ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 20 కోట్ల నిధులతో నారాయణపూర్ చెరువు బండ్ విస్తర ణ, గ్రావిటీ కాలువ నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికానుండగా, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం, భూగర్భ జలాల పెరుగుదల, వ్యవసాయాభివృద్ధికి మహర్దశ పట్టనుందన్నారు. దీంతో పాటు బహుముఖ ప్రయోజనాలు చొప్పదండి నియోజకవర్గానికి అందనున్నాయని తెలిపారు.