23 March, 2026 | 8:59 AM

కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

23-03-2026 12:00 AM

మఠంపల్లి, మార్చి 22 : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశానుసారంగా మఠంపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రేడుపంగు నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మార్చి 30 వ తారీకు జరిగే దీక్షకు సంబంధించిన కర్ర పత్రాలను ఆదివారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావూరి విజయభాస్కర్ మాదిగ హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగే దీక్షను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నవీన్ మాదిగ,మట్టయ్య మాదిగ, వెంకటేశ్వర్లు, శ్రీను,లాజరు, తదితరులు పాల్గొన్నారు.