23 March, 2026 | 7:16 AM

షిరిడీ సాయిబాబా సేవాదళ్ భజన మండలి సేవలు అద్భుతం

23-03-2026 12:00 AM

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 22 : శ్రీ షిరిడి సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవి లో ప్రజల దాహం తీర్చడం అద్భుతమైన విషయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. చలివేంద్రం ఉచిత అల్పాహార కేంద్రాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఉచిత అల్పాహార వితరణ పేదలు మరియు అవసరార్థులకు ఉచితంగా అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు వినోద్, నరేష్, శ్రీనాథ్, రఘు, చంద్రమౌళి, వివేక్, లక్ష్మీనారాయణ తదితరులు చురుకుగా పాల్గొన్నారు.