ప్రతి ఓటరును చైతన్యం చేయండి
07-07-2026 03:08 PM
బోథ్,(విజయ క్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ఓటరు జాబితా కార్యక్రమంలో ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త బిఎల్వోలు ఓటర్లను చైతన్యం చేయాలని బిఆర్ఎస్ సోనాల పట్టణ కమిటీ అధ్యక్షులు పి చిన్నయ్య నాయకులు సుధీర్ రెడ్డిలు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో ఎస్ఐఆర్ పైన ఓటర్ల అవగాహన కల్పిస్తూ బిఎల్వోల ద్వారా ఎన్నిమరేషన్ ఫారాలను పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఓటు హక్కును కోల్పోకుండా ఓటర్లను చైతన్యం చేసేందుకు బిఎల్వోలు సహకరించాలని సూచించారు ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది కార్యక్రమంలో హరీష్ సుగుణాకర్ సంతోష్ తదితరులున్నారు






