30 April, 2026 | 1:35 AM

మే 14న ఎంఆర్‌జేఈఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

30-04-2026 12:25 AM

మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహణ

పోస్టర్ ఆవిష్కరించిన చైర్మన్, వైస్ ఛాన్సలర్ తదితరులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మల్లారెడ్డి యూనివర్సిటీలో 2026-- 27 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం టెస్ట్ (ఎంఆర్‌జేఈఈ-2026) మే 14న కామన్ ఎంట్రన్స్ నమోదు ప్రక్రియ ప్రారంభించారు.ఈ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్త విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. మే 14, 2026న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంఆర్‌జేఈఈ) నిర్వహించనున్నట్లు వెల్లడించి దీనికి సంబంధించిన పోస్టర్‌ను చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, చామకూర శాలీనీరెడ్డి, వైస్‌ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి కలిసి ఆవిష్కరించారు.

ప్రతి భావంతులైన విద్యార్థులను గుర్తిస్తూ అర్హులైన విద్యార్థులకు మల్లారెడ్డి యూనివర్సిటీ సుమారు రూ. 10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు, సెంట్రల్ బోర్డు విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాసేందుకు అర్హులని వారు తెలిపారు. చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ ‘మా లక్ష్యం విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా మార్చడం మాత్రమే కాదు, వారిని క్రమశిక్షణ, నైతిక విలువలు గల ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడం.

ఈ ఏడాది మెరిట్ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారిని ఆదుకోవడానికి స్కాలర్‌షిప్ పథకాలను ప్రవేశపెట్టాం’అన్నారు.డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించాం. బోధనలో నిరంత రం కొత్త పద్ధతులను పాటిస్తూ, అండర్ గ్రాడ్యుయేట్ నుంచి రీసెర్చ్ వరకు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాం’అన్నారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి మాట్లాడుతూ ‘అర్హులైన విద్యార్థులను గుర్తించేందు కే మే 14న ఈ పరీక్షను నిర్వహిస్తున్నాం. ఆస క్తి గల వారు యూనివర్సిటీ వ్బుసైట్ www. mallareddyuniversity.ac.in సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.