టెన్త్‌లో బ్లూబెల్స్ విద్యార్థుల ప్రభంజనం
కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న బ్లూబెల్స్ హై స్కూల్ విద్యార్థులు బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించారు. వరుసగా పదవ సంవత్సరంగా 100% ఉత్తీర్ణత నమోదు చేసి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సంవత్సరంలో అత్యధికంగా 583 మార్కులతో కె. యజ్ఞశ్రీ ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు గర్వకారణమయ్యారు. ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కే.యజ్ఞశ్రీ 583 మార్కులు, టి.రిషిత్ 581మార్కులు, పి.అక్షయశ్రీ 581మార్కులు, టి.నిహాల్ 580మార్కులు, ఎం.దీపిక 579 మార్కులు, ఎం. వినయశ్రీ 576మార్కులు, బి.రిషి నందన్ 575మార్కులు, ఆర్. శ్రీహర్ష 574 మార్కులు, ఎస్.మారుతి 574 మార్కు లు, బి. సాయి సుహాన్ 573 మార్కులు, ఎన్. మోక్షక్ 571మార్కులు, ఎం యశ్వంత్ పటేల్ 571 మార్కులు సాధించారు.
మొత్తం 54 మంది విద్యార్థుల్లో 48 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం విశేషం. 580 పైగా మార్కులు 4 గురు, 570 పైగా మార్కులు 12 మంది, 550 పైగా మార్కులు 22 మంది, 530 పైగా మార్కు లు 34 మంది, 500 పైగా మార్కులు 48 మంది ఉన్నారు. ఈ అద్భుత ఫలితాల నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ అండ్ కర స్పాండెంట్ జంగ సునీత మనోహర్‌రెడ్డి విద్యార్థులను అభినందించి, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.






