10 May, 2026 | 1:57 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

అనారోగ్యంతో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ మృతి

28-02-2026 09:34 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి శనివారం మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురంకు చెందిన శ్రీధర ఉమారాణి  గతంలో మంగపేట మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కమలాపురంలో మృతి చెందారు. ఉమారాణి మృత దేహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, వాజేడు మండల పంచాయతీ అధికారి బి.శ్రీకాంత్ నాయుడు సందర్శించి పార్థివదేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వపరంగా అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా ముప్పై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.