ఉపాధి హామీ పనులు నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో, ఎంపీవో
27-02-2026 12:00 AM
నాగిరెడ్డిపేట్,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):మండలంలోని బంజారా తండా లింగంపల్లి గ్రామలలో ఉపాధి హామీ పనులను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను మాల్తుమ్మెద గ్రామంలో నర్సరీ కంపోస్ట్ షెడ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరై 307 దినసర కూలి పొందాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని పనుల్లో నాణ్యత కలిగి ఉండాలన్నారు.నర్సరీలో ఉన్న ప్రతి ఒక్కరు కాపాడాలని,నర్సరీలో అన్ని రకాల మొక్కలను పెంచాలని, ఉదయం సాయంత్రం వేళలో సరిపడా నీటిని అందించాలని తెలిపారు. కార్యదర్శులు మమత, అశోక్, వనజ, ఫీల్ అసిస్టెంట్లు సాయిలు, మల్లవ్వ, పర్వీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.




