27 February, 2026 | 5:01 PM

వైభవంగా దత్తాత్రేయ స్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన

27-02-2026 12:00 AM

హాజరైన కాశీ పీఠాధిపతి శ్రీ దండి స్వామీజీ

బాన్సువాడ, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరం ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా గురువారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాశీ పీఠాధిపతి శ్రీ దండి స్వామీజీ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యజ్ఞ కార్యక్రమం స్వామివారికి అభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దత్తాత్రేయ ఆలయ అధ్యక్షులు నాగులగామా సాయిబాబా భారతి దంపతులు, పెద్ద హనుమాన్ మందిర్ ఆలయ అధ్యక్షులు నార్ల ఉదయ్ సుజాత దంపతులు సరస్వతి మెడికల్ యజమాని అరవింద్ పవిత్ర దంపతులు హనేగాం రాము ధనలక్ష్మి దంపతులు రిటైర్డ్ ఎస్త్స్ర కోనారెడ్డి దంపతులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నార్ల సురేష్ తృప్తి నాగరాజు నాగులగామా మురళీకృష్ణ రుద్రంగి అశోక్ మెడికల్ రామన్న సంతోష్ ఆలయ అర్చకులు ఆకాష్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.