కమల కుండలిని వ్యూహం!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి మొదలు.. అధికార పీఠం దక్కించుకునే లక్ష్యంగా..
* ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ--జనసేన--బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలుచేసే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీజేపీ కేవలం కార్పొరేషన్ ఎన్నికలుగా కాకుండా తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగించుకోవాలని చూస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీడీపీ-జనసేన-బీజేపీ కలయిక నగర ఓటర్లలో మంచి ప్రభావం చూపితే అదే కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో వ్యూహాత్మక సమీకరణాలకు కూడా అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
* అభివృద్ధి, రాజకీయాలు, వ్యూహాత్మక మైత్రి ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ తెలంగాణలో బీజేపీ.. దక్షిణాది విస్తరణకు బలమైన పునాది వేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్ ఇంకా గ్రామీణ స్థాయిలో ప్రభావం కొనసాగిస్తోంది.
ఇదే సమయంలో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో తన బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నగర పాలనకే పరిమితం కాకుండా భవిష్యత్ అసెంబ్లీ రాజకీయాలకు సెమీ ఫైనల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నాతో కలిస్తే మంచిది..
* ‘మీరు చేరాలనుకునే స్థాయికి చేరుకోలేరు కాబట్టి నాతో కలిస్తేనే మంచిది’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
* బీజేపీ పాలనలోనే గుజరాత్ తరహా అభివృద్ధి సాధ్యమని మోదీ సంకేతాలు ఇచ్చారు.
* కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల్లో 50 శాతం ఇతర అవసరాలకు వెళ్తున్నాయనే విమర్శ.
* కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఇంకా ప్రభావం చూపుతున్నది. బీజేపీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్న పరిస్థితి.
* తదుపరి ఎన్నికల్లో కమలం వికసిస్తుంది అన్న మోదీ ధీమా రాజకీయ చర్చకు దారితీసింది.
* ప్రత్యక్ష పోటీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ప్రారంభమయ్యే మైత్రి ప్రయోగాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు అన్ని మార్గాలకూ బీజేపీ సిద్ధమనే సంకేతాలు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకునే సామర్థ్యాన్ని బీజేపీ ప్రదర్శిస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
- హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాలేదు. మౌలిక వసతుల ప్రాజె క్టుల ప్రారంభోత్సవాల వెనుక స్పష్టమైన రాజకీయ సందేశం కూడా కనిపించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమ క్షంలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన రైల్వే, టెక్స్‌టైల్, అర్బన్ ఇన్ఫ్రా, హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన మోదీ.. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ లక్ష్యాలపై కూడా సంకేతాలు ఇచ్చారు.
అంతకు ముందు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆర్థిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. దేశ జనాభాలో 3 శాతం కన్నా తక్కువ ఉన్నప్పటికీ జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ౧ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుద్ధరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని మోదీని కోరారు. రెండు గంటల సమయం ఇస్తే తెలంగాణ ప్రతిపాదనలు పూర్తిగా వివరిస్తాం అంటూ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన మోదీ.. ‘రేవంత్ జీ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు.
నేను కూడా రాజకీయంగా మాట్లాడను’ అంటూ మొదలుపెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌కు పదేళ్లలో కేంద్రం ఎంత ఇచ్చిందో తెలంగాణకూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే వెంటనే రాజకీయ సూచన జోడిస్తూ.. కానీ మీరు ప్రస్తుతం పొందుతున్నది సగానికి పడిపోతుంది. మీరు చేరాలనుకునే స్థాయికి చేరుకోలేరు. కాబట్టి నాతో కలిస్తేనే మంచిది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సభలో నవ్వులు, చప్పట్లు వినిపించాయి.
తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు. అదే సమయంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అ సోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీ బలపడిన ఉదాహరణలు ప్రస్తావిస్తూ తెలంగాణలో కూడా కమలం వికసిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే గుజరాత్ తరహా అభివృద్ధి సాధ్యమని సంకేతాలు ఇచ్చారు.
ఈ ప్రసంగంలో బీఆర్‌ఎస్‌పై మోదీ ప్రత్యక్ష విమర్శలు చేయకపోవడం కీలకమైన అంశంగా మారింది. గతంలో బీఆర్ ఎస్ మధ్య సాన్నిహిత్యం ఉన్నదన్న ప్రచారం నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టు కుని బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందనే చర్చ రాజకీ య వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మోదీ హైదరాబాద్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగా ణలో బీజేపీ విస్తరణ వ్యూహానికి బలమైన సంకేతాలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లాంచ్ ప్యాడ్‌గా జీహెచ్‌ఎంసీ..
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలతో ముగియలేదు. రాజకీయ పరంగా కూడా కీలక సంకేతాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసా లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ-జనసేన--బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలుచేసే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నా యి.
ముఖ్యంగా త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీజేపీ కేవలం కార్పొరేషన్ ఎన్నికలుగా కాకుండా తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగించుకోవాలని చూస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ--జనసేన--బీజేపీ కలయిక నగర ఓటర్లలో మంచి ప్రభావం చూపితే అదే కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేస్తు న్నారు.
అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో వ్యూహాత్మక సమీక రణాలకు కూడా అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అందుకే మోదీ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం రేవంత్‌రెడ్డి పట్ల మోదీ ప్రదర్శించిన సానుకూల ధోరణిని రాజకీయ పరిశీలకులు లేయర్డ్ డిప్లమసీగా విశ్లేషిస్తున్నారు. దఫదఫాలుగా అనుసరించనున్న వ్యూహం కనిపిస్తున్నదని చెబుతున్నారు.
ఒకవైపు కేంద్ర, -రాష్ట్ర సంబంధాలను సానుకూలంగా కొనసాగిస్తూ మరోవైపు భవిష్యత్ రాజకీయ అవకాశాలకు కూడా మార్గం సుగమంచేసే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు. కమలంతో కలిసి నడిస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం అనే సందేశాన్ని మోదీ పరోక్షంగా ఇవ్వాలని ప్రయత్నించారని విశ్లేషకులు అంటున్నారు. అభివృద్ధి, రాజకీ యాలు, వ్యూహాత్మక మైత్రి ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ తెలంగాణలో బీజేపీ.. దక్షిణాది విస్తరణకు బలమైన పునాది వేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్ ఇంకా గ్రామీణ స్థాయిలో ప్రభావం కొనసాగిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో తన బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యం లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నగర పాలనకే పరిమితం కాకుండా భవిష్యత్ అసెంబ్లీ రాజకీయాలకు సెమీ ఫైనల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీలో విజయవంతమైన ప్రదర్శన బీజేపీకి భారీ ఉత్తేజాన్ని ఇవ్వొచ్చు. అదే సమయంలో ఫలితాలు అనుకూలంగా లేకపోతే వ్యూహాత్మక మార్పులు, కొత్త మైత్రికి అవకాశాలు కూడా తెరపైకి రావచ్చు. ఈ నేపథ్యం లో మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వ్యూహాత్మక రాజకీయం..
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా అభివృద్ధి పేరుతో కేంద్రం నుంచి భారీ మద్దతు ప్రకటిస్తూనే రాజకీయంగా కూడా బీజేపీ తన భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టంగా చూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాలకు మరింత సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అయితే ఆ సహకారం రాజకీయ సమన్వయంతోనే మరింత ఫలితాలు ఇస్తుందనే సంకేతాన్ని కూడా పరోక్షంగా ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డితో సానుకూల ధోరణి ప్రదర్శించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో ప్రత్యేక భేటీలు నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలు ఎన్డీయే ఐక్యతను బలంగా ప్రదర్శించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన టీడీపీ--జనసేన--బీజేపీ మోడల్ తెలంగాణలో కూడా ప్రభావం చూపే అవకాశాలను సూచిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక పాత్ర భవిష్యత్ కూటమి అవకాశాలకు మరింత బలం చేకూరుస్తోందనే అభిప్రాయాలు విని పిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మూడు ప్రధాన శక్తుల మధ్య పోటీగా మారాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్‌కు ఇంకా ప్రాంతీయ స్థాయిలో ప్రభావం ఉంది. బీజేపీ క్రమంగా గ్రామీణ, పట్టణ స్థాయి లో తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల్లో కమలం అధికారంలోకి వస్తుంది అన్న మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్యక్ష పోటీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ప్రారంభమయ్యే కూటమి ప్రయోగాలు, అవసరమైతే వ్యూహాత్మక భాగస్వామ్యాల వంటి పలు మార్గాల్లో బీజేపీ ముందుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకునే సామర్థ్యాన్ని పార్టీ ప్రదర్శిస్తోందని అంటున్నారు.
ఈ పర్యటనలో ప్రకటించిన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రజలకు తక్షణ ప్రయోజనాలను అందిం చనున్నాయి. రైల్వేలు, కనెక్టివిటీ, ఆరోగ్య వసతుల విస్తరణ వంటి అంశాలు అభివృద్ధి కోణంలో కీలకంగా మారాయి. అయితే అదే సమయంలో మోదీ ప్రసంగం, భేటీలు, రాజకీయ సంకేతాలు ఇవన్నీ భవిష్యత్ రాజకీయ దిశను కూడా సూచిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పడింది.
ఈ ఎన్నికలు తెలంగాణలో బీజేపీ వ్యూహానికి తొలి పరీక్షగా మారే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఫలితాలు భవిష్యత్ అసెంబ్లీ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు అభివృద్ధి అవస రాలు మరోవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఈ రెండింటి మధ్య కమలం తన స్థానం బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






