ఓటరు జాబితా రూపకల్పన బాధ్యత
12-05-2026 01:47 AM
ఎమ్మెల్యే కేపీ వివేకానంద
కుత్బుల్లాపూర్, మే 11 (విజయక్రాంతి): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన ప్రతీ పౌరుడి బాధ్యతని, ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130- సుభాష్ నగర్ డివిజన్ అపు రూప కాలనీ కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్‌పై నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడారు. రయ్యారు. యువత ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పాల్గొన్నారు.






