12 May, 2026 | 2:05 AM

విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్

12-05-2026 12:55 AM
  1. రూ.వెయ్యి కోట్లు కేటాయింపు
  2. మధ్యాహ్న భోజనంతో పాటు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ స్కీం 
  3. టెన్ ప్లస్ టూ విధానం లేకపోవడం వల్లే డ్రాపౌట్లు
  4. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్‌ను నిర్మించే వేదికలుగా మారాలి 
  5. విద్యారంగానికి నిధులు పెంచుతాం
  6. త్వరలోనే మరిన్ని మంచి నిర్ణయాలు
  7. విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చె ప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి విదార్థికి 21 వస్తువులతో కూడిన స్పెష ల్ కిట్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. టెన్ ప్లస్ టూ విధానం లేకపోవడంతో పదో తరగతి తర్వాత డ్రాపౌట్‌లు పెరుగుతున్నాయ ని, తగ్గించేందుకు పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు  సీఎం తెలిపారు.

అందులో భాగంగా స్పెషల్ కిట్‌లకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అదే విధం గా మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.  ప్రజా పాలన - ప్రగ తి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ వారోత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. యూనివర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమా జం బలహీనపడుతుందని భావించి వాటికి నిధులు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. 

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని..  తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందించాలని భావించి ఈ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో  వచ్చిన వెంటనే 11వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశా రు. అలాగే 22 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 36 వేల మంది ఉపా ధ్యాయుల బదిలీలు పూర్తి చేశామన్నారు.

నీతి ఆయోగ్ అభినందించింది

రాష్ట్ర విద్యాశాఖ సాధించిన విజయాలను నీతి ఆయోగ్ అభినందించిందని సీఎం గుర్తు చేశారు. విద్యా శాఖ ఉద్యోగులు, టీచర్ల కృషిని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తం గా 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థి, టీ చర్ల నిష్పత్తి 17:1గా ఉందని, కేంద్రం సూచించిన దానికంటే ఇది మెరుగైందన్నారు.

రా ష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలలుంటే, అందులో 38 లక్షల మంది చదువుతున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏ మిటి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లోపం ఏమిటి? అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతానికి పైగా నిధులను విద్యకోసం కేటా యించామని, క్రమక్రమంగా 15 శాతానికి పెంచుతామన్నారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలప డమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. 

విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించే ఉపాధ్యాయులను సత్కరిస్తాం

విద్యా విధానం పరిశీలనకు 25 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్ దేశానికి పంపామని, మరో 500 మందిని త్వరలో విదేశా లకు పంపిస్తామని సీఎం తెలిపారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి ఉత్తములుగా తీర్చిదిద్దిన టీచర్లను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు  సన్మానం చేస్తామన్నారు. దేశా నికే ఆదర్శంగా ఉండేలా నూతన విద్యా విధానం తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు.

ప్రభుత్వ పాఠ శాలల్లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు నిర్వహిస్తామని మరోసారి గుర్తు చేశారు. పదో తరగతి తర్వాత డ్రాపౌట్‌లను తగ్గించేందుకు   బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తీసుకువస్తున్నా మని, కొడంగల్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమ లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నడూ లేనంతగా 200 శాతం కాస్మోటిక్ చార్జీలు, 40 శాతం డైట్ చాలు పెంచామని తెలిపారు. కాలానుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. 

రూ.20వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూళ్లలో చదివి విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఐఏఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు కావాలన్నదే తన స్వప్నమన్నారు.  

ఎడ్యుకేషన్ కిట్‌ల నాణ్యతను స్వయంగా పరిశీలించా

ఎడ్యుకేషన్ కిట్‌ల నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని ముఖ్యమంత్రి తెలిపారు. కిట్‌లలో నాణ్యమైన వస్తువులు రాకపోతే  ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నాణ్యతలేని వస్తు వులను సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. పాఠశాలల ప్రా రంభం రోజునే పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఒక జత యూనిఫామ్ అందజేస్తాం, మరో జత నెలాఖారున ఇస్తామన్నారు.  ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యార్థులకు ర్యాంకులు రావాలన్నారు. 

టీచర్లు గంట అదనంగా పనిచేయాలి

టీచర్లకు ఒకటో తేదీన వేతనం ఇవ్వడంతో పాటు ఇతర మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. ప్రభుత్వ టీచర్లకు ఇది ఉద్యోగం కాదు భావ్వోదేగం .. బరువు కాదు బాధ్యత.. అన్నారు. 19 లక్షల కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలని కోరారు.  

సీఎంగా కాదు.. విద్యాశాఖ మంత్రిగా చూడండి

విద్యా శాఖకు మంత్రి లేడని కొం దరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖపై సమీక్ష సమయంలో తన ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యా శాఖ మంత్రిగా చూడాలన్నారు. ఎన్ని శాఖలున్నా.. విద్యాశాఖపై ఉన్న మక్కువతో ఆ శాఖను తన దగ్గర పెట్టుకున్న ట్లు చెప్పారు.