12 May, 2026 | 2:53 AM

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతి

12-05-2026 01:46 AM
  1. దేశంలోనే అత్యుత్తమ వేతనం అమలు చేస్తాం  
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి) : రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను క ల్పించేందుకు ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం హైదరా బాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ పమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొ న్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, కార్మిక శాఖ కమిషనర్ దాసరి హరిచందన, ఫైనా న్స్ అండ్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రా ల్లో అమలవుతున్న కనీస వేతనాలకు సం బంధించిన విధివిధానాలను కమిటీ పరిశీలించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన లేబర్ కోడ్ అంశాల ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై చర్చించారు. కార్మికుల వేతనాలను కేవలం అంకెల్లో కాకుండా, వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా సవరించాలని, పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాలని కమిటీ నిర్ణయించింది. దేశంలోని అ త్యుత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేయాలని, అందుకోసం వేతనాల సవరణ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

తెలంగాణను కార్మికుల పక్షపాతిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి, కార్మికులకు మేలు చేకూర్చే విధంగా కనీస వేతనాల సవరణపై తుది నిర్ణ యం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.