బండి భగీరథ్ పోక్సో కేసుపై సిట్
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు
- పోక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని సూచన
- కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు మారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు తెలుస్తోంది. వెంటనే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో సో మవారం సిట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ నెల 8నే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ప్రశ్నించారు. మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ తెలిపారు. కేసు వివరాలను ఈ సందర్భంగా సీ ఎంకు ఆయన వివరించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ సీవీ ఆనంద్ చర్యలు ప్రారంభిం చారు. బండి భగీరథ్ కేసు దర్యాప్తు పర్యవేక్ష ణ బాధ్యతలను కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ కు అప్పగించారు.
ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాం శంగా మారింది. ఈ కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. బాధితురాలు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లోపాలు చో టుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని ప్రారం భించినట్లు సమాచారం.
పోలీసులు బాలిక స్టేట్మెంట్‌ను చట్టపరమైన నిబంధనల ప్రకా రం రికార్డ్ చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భా గంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు కూడా పరిశీలించే అవకాశముంది. ఈ ఘటనపై హైదరాబాద్ పరిధి లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యా దు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు అంశంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సీపీ నుంచి కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. దీనిపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ఓ బాలిక (17) తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారమే భగీరథ్ కరీంనగర్ టూటౌన్ పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదైంది.






