27 August, 2026 | 7:02 PM

తెలంగాణ సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు

27-08-2026 05:55 PM

ఖమ్మం విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి (శ్రావణ పున్నమి) సందర్భంగా అక్కాతమ్ముళ్లు,అన్నాచెల్లెళ్లకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా ఘనంగా జరుపుకుంటారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి అనేది అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, రక్షణకు ప్రతీకగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన హైందవ పండుగ అని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

సోదరీమణులు తమ సోదరుల నుదుట బొట్టు పెట్టి కుడి చేతి మణికట్టుకు రాఖీని (రక్షా సూత్రాన్ని)కట్టి వారి శ్రేయస్సు, ఆయురారోగ్యాలు బాగుండాలని భగవంతున్ని ప్రార్థిస్తారన్నారు.ఈ సందర్భంగా సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు జీవితాంతం తోడుగా ఉంటామని అభయమిస్తూ పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటారని, బహుమతులు,కానుకలు అందజేస్తారని ఎంపీ రవిచంద్ర వివరించారు. ఈ పండుగ కేవలం రక్తసంబంధీకులకు మాత్రమే కాకుండా సమాజంలో సోదర,పరస్పర రక్షణ భావాన్ని పెంపొందించడానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) పర్వదినం సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులకు ఎంపీ వద్దిరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.