27 August, 2026 | 8:22 PM

ఓటరు జాబితా సవరణపై ప్రజలకు అవగాహన

27-08-2026 06:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం  మంచరామి గ్రామంలో గురువారం ఓటరు జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలనుపరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే సకాలంలో పూర్తి చేసుకోవాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.