28 August, 2026 | 1:23 AM

​జానంపేటలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం

27-08-2026 05:52 PM

 పొనుగోటి కామేశ్వరరావు బహిష్కరణ! 

​పినపాక ఆగస్టు 27, (విజయక్రాంతి): ​పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సిన ,పార్టీకి వెన్నుపోటు పొడిచిన పొనుగోటి కామేశ్వరరావుతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అడహక్ కమిటీ స్పష్టం చేసింది. అతన్ని పార్టీ నుంచి పుష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

​ఈ మేరకు జానంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ​ఇటీవల జరిగిన జానంపేట గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పొనుగోటి కామేశ్వరరావు ప్రధాన కారణమని పార్టీ గ్రామ కమిటీ నిర్ధారించింది. ప్రజలలో నమ్మకం కోల్పోయి, పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను గుర్తించారు.