సర్ పేరుతో అర్హులైనవారి ఓట్లను తొలగించొద్దు
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్
ములకలపల్లి,ఆగస్టు 27 (విజయక్రాంతి): సర్ పేరుతో అర్హులైనవారి ఓట్లను తొలగించోద్దని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.గురువారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి భారత పౌరులకు ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలన్నారు. బిఎల్ఏ లను కలుపుకొని సర్వే నిర్వహించాలన్నారు. వలస ఆదివాసి ఓట్లు తొలగిస్తున్నారని ఈ విధానం సరైనది కాదని వలస ఆదివాసిలు భారత దేశ పౌరులేనని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని కొంత సడలింపు ఇవ్వాలని ఏజెన్సీలో చదువుకోని గిరిజనులు నష్టపోయే ప్రమాదం వున్నదని వారికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, గౌరీ నాగేశ్వరరావు,వూకంటి రవికుమార్,మాలోతు రావూజ, నిమ్మల మధు,పాయం అమల,గోగ్గల ఆదినారాయణ,లక్ష్మి నరసయ్య, వర్షా శ్రీరాములు,కీసరి వెంకట్రావ్,కుంజా రామ్మూర్తి, మంచాల సారయ్య,బైరు ప్రసాద్,పద్దం తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.






