28 August, 2026 | 12:09 AM

సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

27-08-2026 06:59 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలంలోని బొంతగట్టునాగారం గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు భూక్యా రవి నాయక్, బైకాని రమా బాలరాజు యాదవ్, దండెం శ్రీనివాస్, గూగులోత్ లలిత రాజు, మంచినీళ్ల రాజు, భూక్యా ధనుష్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూక్యా జూంలాల్ నాయక్, నూకల కృష్ణమూర్తి, ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉట్ల మల్లారెడ్డి, పంగ కిరణ్ కుమార్, పోగుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.